Oneindia Mobile
Photo Gallery!
భారతీయ రోడ్ల పై టయోటా 'అవాంజా' హల్ చల్
బుదవారం, నవంబర్ 4, 2009, 18:20 [IST]



Toyota Avanza
జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ టయోటా ఆటోమొబైల్స్ కు చెందిన ఇన్నోవా, క్వాలిస్ వాహనాలు భారతీయ మార్కెట్ లో బహుళజనాదరణ పొందిన విషయం తెలిసిందే. భారతీయులకి ఈ భారీ వాహనాలు ఎంతో నచ్చేసాయని వేరే చెప్పనవసరం లేదు. దీన్ని దృష్టిలో వుంచుకొని టయోటా కంపెనీ మరో భారీ వాహనం అవాంజా ను ఇక్కడి మార్కెట్ లోకి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ అవాంజా కారు ధరను 6 నుండీ 8 లక్షల మధ్య నిర్ణయించనున్నట్టు తెలిసింది.

అంతే కాదు ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో కేవలం 3% షేర్ వున్న టయోటా మోటార్స్ తన షేర్ ను పెంచుకొనేందుకు, భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ ఏలుతున్న టాటా మోటార్స్, మారుతి సుజికి లకు గట్టి పోటీని ఇచ్చేందుకు ఓ చిన్న కారుని కూడా మన దేశ మార్కెట్ లోకి విడుదల చెయ్యనుందట. 2011 వ సంవత్సరం నాటికి ఈ చిన్న కారు మన ముందుకు రానుందని కంపెనీ ఓ ప్రకటనలో వెళ్లడించింది. టోక్యో మోటర్ షోలో మాట్లాడిన టయోయా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యుకితోషి పునో "టయోటాను భారతీయ మార్కెట్ లో మరింత ముందుకు తీసుకుపోయేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు, దీనికి కొంత సమయం పట్టవచ్చని, కానీ దీర్ఘకాలిక ప్రణాళికతో తాము ముందుకు పోతున్నట్టు" తెలిపారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.