Oneindia Mobile
గట్టి పోటీకి సిద్ధమవుతోన్న టాటా మోటార్స్
శుక్రవారం, నవంబర్ 6, 2009, 14:51 [IST]



Tata Indicruz
భారతీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త మల్టీపర్పస్ వెహికల్ టాటా ఇండిక్రూజ్ ఎప్పుడు వస్తుందోనని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. టయోటా ఇన్నోవా, చెవ్రోలెట్ టవేరా, మహీంద్రా గ్జిలో వాహనాలకు పోటీగా టాటా మోటార్స్ రూపొందించిన టాటా ఇండిక్రూజ్ ఈ ఏడాదిలో మార్కెట్ లోకి రానుందని టాటా కంపెనీ గత సంవత్సరం ప్రకటించారు.

టాటా సఫారీ లాంటి మల్టీపర్పస్ వెహికల్ గ్రాండ్ సక్సెస్ తర్వాత రాబోతున్న ఈ కారు మీద మంచి అంచనాలే వున్నాయి. టాటా సఫారీకి ఉపయోగించిన 2.2 లీటర్ డైకోర్ డీజిల్ ఇంజన్ నే ఈ వాహనానికి కూడా ఉపయోగించారు. ఏడుగురు సౌకర్యంగా కూర్చోడానికి వీలుగా ఈ కారును డిజైన్ చేసారు. కాగా ఈ ఏడాది జూన్ లో ఈ కారు వినియోగదారుడికి అందుబాటులోకి వస్తుందని తొలుత అందరూ భావించినా ఇంకా కారు విడుదల గురించి టాటా మోటార్స్ ఎలాంటి ప్రకటన చెయ్యకపోవడంతో అసలు ఈ కారు ఈ ఏడాది విడులకానుందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏదెలా వున్నా ఈ కారు విడుదలయితే మిగితా కంపెనీల వారికి ఇబ్బందే అనడంలో అతిశయోక్తి లేదు.



»Home »News  »Entertainment  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.