Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
'ఆర్య-2'ని ముంచే పనిలో...
మంగళవారం, సెప్టెంబర్ 29, 2009, 10:15 [IST]



Allu Arjun
సూపర్ హిట్ సినిమా 'ఆర్య'కు సీక్వెల్ గా వస్తోన్న 'ఆర్య-2' ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇంతకు ముందు ఈ సినిమా పాటలు లీకయ్యి వార్తల్లో నిలిస్తే, తాజాగా సినిమా పోస్టర్లు కూడా అదే విధంగా లీకయ్యి సంచలనం సృష్టించాయి. దీంతో ఖంగుతిన్న నిర్మాత అఫీషియల్ గా కొన్ని డిజైన్లను విడుదల చేసాడు. దీంతో సమస్య తీరిపోయింది, ఈ నెలాఖరుకి ఆడియో విడుదల చేసి అక్టోబరు మొదటి వారంలో సినిమాని విడుదల చెయ్యాలనుకున్న నిర్మాతకు మరో సమస్య వచ్చి పడింది.

దీనికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కారణమయ్యారు. అసలు విషయం ఏంటంటే తనని అడక్కుండా పోస్టర్లను రిలీజ్ చేసినందుకు అల్లు అర్జున్ అలిగారట. దీంతో డబ్బింగ్ చెప్పనని మొరాయిస్తున్నాడట. మరో వైపు చిత్రదర్శకుడు సుకుమార్ తన పారితోషికం ఇంకా రావాల్సివుందని పోస్ట్ ప్రోడక్షన్ పనులు ఆపేశాడని సమాచారం. మొత్తానికి హీరో, దర్శకుడు కలిసి సినిమాని, నిర్మాతని ముంచేసే పనిలో వున్నారన్నమాట.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.