Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
మీరా జాస్మిన్ కు మోక్షం సిద్దించనుంది
మంగళవారం, నవంబర్ 3, 2009, 19:11 [IST]



Meera Jasmine
మొత్తానికి మీరాజాస్మిన్ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటోంది. అదిగో...అప్పుడు ఇదిగో ఇప్పుడు అంటూ రిలీజ్ కోసం ఊరించిన అఆఇఈ చిత్రం రిలీజ్ అవుతోంది. అందులో ఆమె శ్రీకాంత్ సరసన చేసింది. అలాగే ఆమె చుట్టూ తిరిగే కథతో మోక్ష అనే చిత్రం ప్రారంభం కానుంది. వీటికి తోడు ఇన్నాళ్ళూ బ్యాన్ ఉన్న మళయాళంలోనూ ఆమె హీరోయిన్ గా ఓ చిత్రం ప్రారంభమవుతోంది. ఇక మోక్ష చిత్రాన్ని శ్రీకాంత్‌ వేములపల్లి దర్శకత్వం వహిస్తారు. ఆయన వినిపించిన కథాంశం మీరాను అమితంగా ఆకట్టుకుందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీకాంత్ వేములపల్లి ఇంతకు ముందు రాజీవ్ కనకాల హీరోగా బ్లాక్ అండ్ వైట్ అనే చిత్రాన్ని రూపొందించి సంగతి తెలిసిందే.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.