Oneindia Mobile
Photo Gallery!
మహేష్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్లో చిత్రం!?
బుదవారం, నవంబర్ 4, 2009, 17:53 [IST]



Mahesh Babu
త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఖిలాడి చిత్రం షూటింగ్‌లో మహేష్‌ బిజీగా వున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటింపజేయాలని ప్రముఖ నిర్మాత ఒకరు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మగధీర అనంతరం సునీల్ తో చేస్తున్న మర్యాద రామన్న కామిడీలో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం ఈ ప్రాజెక్టు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజమౌళి, మహేష్‌ బాబుల కలయికలో చిత్రం నిర్మాణం జరిగితే తెలుగులో అత్యధిక వ్యయంతో తెరకెక్కే చిత్రం ఇదే అవుతుందని విశ్లేకులు చెబుతున్నారు. వ్యాపార పరంగా కూడా ఈ చిత్రం కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.ఇక త్రివిక్రమ్ చిత్రంలో మహేష్ సరసన అనూష్క చేస్తోంది. పులి చిత్రాన్ని నిర్మిస్తున్న శింగనమల రమేష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సమ్మర్ కి ఈ చిత్రం ధియోటర్స్ లో ఉంటుంది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.