Oneindia Mobile
Todays Top Searches- Get here NOW!
ఇవివి సత్యనారాయణ హాఫ్ సెంచరీ ఫిల్మ్ అదే
బుదవారం, నవంబర్ 4, 2009, 19:32 [IST]



EVV Satyanarayana
చెవిలో పువ్వు చిత్రంలో దర్శకుడుగా పరిచయమై ప్రేమఖైదీతో కమర్షియల్ దర్శకుడుగా సెటిలైన ఇవివి సత్యనారాయణ హాఫ్ సెంచరీకి రెడీ అవుతున్నారు. తన కుమారుడు అల్లరి నరేష్ తో చేసిన 'బెండు అప్పారావు'తో ఆయన దర్శకుడిగా 49 చిత్రాలు పూర్తి చేశారు. ఇక యాభయ్యో చిత్రంగా ఫుల్ లెంగ్త్ కామిడీ చిత్రాన్నే చేయాలని ఇ.వి.వి. భావిస్తున్నారు. 'ఎవడి గోల వాడిది' చిత్రానికి సీక్వెల్‌ చేయాలని సంకల్పించారు. ప్రస్తుతం ఆయన ఈ సినిమాకి సంబంధించిన కధా చర్చల్లో ఉన్నారు. ఆర్యన్‌ రాజేశ్‌ కథానాయకుడిగా ఆయన రూపొందించిన 'ఎవడి గోల వాడిది'హిట్ అవటంతో ఈ సీక్వెల్ పై మంచి ఆశలే ఉన్నాయి. రెండో భాగం కూడా ఆ స్థాయిలోనే ఉండేలా చూసుకొంటున్నారు. లగడపాటి శ్రీధర్‌ ఈ సినిమాని నిర్మిస్తారు. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.