Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
స్టార్ హీరోకి త్రిష ఖరీదైన గిప్ట్
శుక్రవారం, నవంబర్ 6, 2009, 9:09 [IST]



Trisha
సాధారణంగా హీరోలు..హీరోయిన్స్ కి గిఫ్ట్ లు ఇస్తూండటం ఆనవాయితి. అయితే అందుకు రివర్స్ గా త్రిష తనతో చేస్తున్న తమిళ స్టార్ హీరో శింబకు స్టోరీబోర్డ్‌ సాఫ్ట్ వేర్ ని ప్రజెంట్ చేసింది. అది చాలా ఖరీదైనదిట. వీరిద్దరూ 'విన్నైత్తాండి వరువాయా' అనే చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల న్యూయార్క్‌లో జరిగింది. అక్కడ ఆమే ఆ పని చేసింది. ఇక ఆ గిప్ట్ చూసిన శింబు చాలా ఆనందపడ్డాడట. అంతేగాక తన స్నేహితులకు ఫోన్ చేసి మరీ చెప్పాడుట. ఇక ఈ సాఫ్ట్ వేర్ ఇవ్వటానికి కారణం త్వరలో శింబు సినిమా చేయబోతున్నాడు. దాంతో సినిమాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని తాపత్రయపడుతున్న శింబకి ఇది ఎంతో విలువైన బహుమతి అని భావించే త్రిష ఈ గిప్ట్ ఇచ్చింది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.