Oneindia Mobile
Photo Gallery!
టాప్ డైరెక్టర్ కి జలక్ ఇచ్చిన అసిన్
బుదవారం, నవంబర్ 4, 2009, 18:12 [IST]



Asin
‘గజిని’ బాలీవుడ్ లో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే అసిన్ రెండో సినిమా లండన్ డ్రీమ్స్ కి కనీసం అందులో పదో వంతు క్రేజ్ కూడా రాలేదు. సినిమా పర్వాలేదుంటున్న ప్రేక్షకులలో అధికంగా సల్మాన్ నే పొగిడేస్తున్నారు. దీంతో ఇకపై సినిమాల ఎంపికలో జాగ్రత్త పడాలని అసిన్ భావిస్తోందట. అందుకే కాబోలు టాప్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ సినిమాలో అవకాశాన్ని వదిలేసుకుందట. తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో అసిన్ ఈ చిత్రం నుంచి తప్పుకుందని అనుకుంటున్నారు. స్టార్ హీరోయిన్లంతా అతని సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తోంటే అసిన్ ఇలా చేయడమేంటని కూడా గుసగుసలాడుతున్నారు. అసిన్ అతి జాగ్రత్త పడితే అసలుకే ప్రమాదం వచ్చినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.