Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
మైఖేల్ జక్సన్ ది ముమ్మాటికీ హత్యే..!!
శుక్రవారం, నవంబర్ 6, 2009, 16:36 [IST]



Michael Jackson
ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ది ఖచ్చితంగా హత్యే అంటున్నాడు అతని సోదరుడు ప్రొడ్యూసర్ లా టోయా జాక్సన్. అంతే కాకుండా ఆయన హత్యకు కుట్ర పన్నిన వారు ఎవరో కూడా తనకు తెలుసని ఆయన బాంబు పేల్చాడు. ఈ ఏడాది జూన్ 25న ఈ పాప్ స్టార్ అందరినీ శోకసంద్రంలో ముంచేసి అందనంత దూరాలకు తరలివెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణానికి అతిగా వాడిన డ్రగ్సే కారణం అని ఆయన పర్సనల్ డాక్టర్ ఫిజీషియన్ డాక్టర్ ముర్రే వెళ్లడించిన విషయం తెలిసిందే.

కానీ ఆయనది ముమ్మాటికీ హత్యేనని లా టోయా జాక్సన్ ఆరోపిస్తున్నాడు. మైఖేల్ చేసే పని నచ్చకో, లేక అతని ఎదుగుదలను చూడలేని వారో ఈ హత్య చేసుంటారని ఆయన చెప్పినట్టు డైలీ ఎక్స్ ప్రెస్ పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఇదిలా వుండగా మైఖేల్ చివరి సినిమా 'దిస్ ఈజ్ ఇట్' సినిమా రికార్డు స్థాయిలో వసూల్లు రాబడుతూ దూసుకుపోతంది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.