Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
మహేష్ ఆ సినిమాకు నిర్మాత దిల్ రాజు?
గురువారం, నవంబర్ 5, 2009, 17:40 [IST]



Mahesh Babu
స్టార్ నిర్మాత దిల్ రాజు,స్టార్ హీరో మహేష్ కాంబినేషన్లో ఇప్పటివరకూ ఏ చిత్రమూ రాలేదు. అయితే ఇప్పుడా కొరత తీర్చటానికా అన్నట్లు ఓ ప్రపోజల్ తో దిల్ రాజు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళితో మహేష్ చేయనున్న చిత్రానికి దిల్ రాజు నిర్మాత అని వినపడుతోంది. అలాగే ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తీయనున్నట్లు చెప్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రం రాలేదనేంత గొప్ప సినిమా తీయాలని సంకల్పించుకునే ఈ ప్రాజెక్టుతో వస్తున్నారని చెప్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న చేస్తున్నారు. దిల్ రాజు దాదుపు ముప్పై కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దీనిని రూపొందించనున్నట్లు సమాచారం. మరో ప్రక్క మహేష్ బాబు తన లేటెస్ట్ ప్రాజెక్టు ఖిలాడీలో బిజీగా ఉన్నారు. దీనిని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.