Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
ప్రిన్స్ మహేష్ బాబు ‘స్టార్ నైట్ కు' రావట్లేదా?
శనివారం, నవంబర్ 7, 2009, 15:16 [IST]



Mahesh Babu
వరద బాధితుల సహాయార్థం తెలుగు సినీ పరిశ్రమ ఈనెల 7న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 'స్పందన' కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు హాజరయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. నిజానికి ఈనెల 5వ తేదీ నుంచి అనుష్క, మహేష్ జంటగా స్టార్ డైరెక్టర్, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతిథి’ తర్వాత మరో చిత్రం 'కిలాడీ' (టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) నవంబర్ మొదటి వారంలో షూటింగ్ రాజస్థాన్ లోని వికారాబాద్ లో జరుగవలసి ఉంది. అయితే 'స్టార్ నైట్' ప్రిపరేషన్లు, రిహార్సల్స్ దృష్ట్యా నిర్వాహక కమిటీ 5, 6,7 తేదీలను పరిశ్రమకు సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో షూటింగ్ ఎక్కడా జరగరాదని స్పష్టం చేసింది. దీంతో 'కిలాడీ' చిత్ర యూనిట్ 7వ తేదీ తర్వాతే రాజస్థాన్ చేరుకుని 9 నుంచి షూటింగ్ ప్రారంభిస్తుందని తెలుస్తోంది.

మహేష్ సైతం ప్రస్తుతం లండన్ లో ఉన్నారని తెలుస్తోంది. అక్కడ్నించి ఆయన ముంబై చేరుకుని నేరుగా రాజస్థాన్ వెళ్లి షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. దీంతో 'స్టార్ నైట్'లో మహేష్ పాల్గొనే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, నరేష్, అదిశేషగిరిరావు హాజరవుతారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.