Oneindia Mobile
మరోసారి వాణివిశ్వనాధ్ విశ్వరూపం చూస్తామా?
మంగళవారం, నవంబర్ 3, 2009, 19:17 [IST]



Vani Viswanath
ఘరానామొగుడు వంటి చిత్రాలలో తన శృంగార విన్యాసాలతో ఒక ఊపు ఊపిన వాణివిశ్వనాధ్ త్వరలో తెలుగు వారకిని పలకరించనుంది. అయితే 'అంతిమ తీర్పు'అనే డబ్బింగ్ చిత్రంతో ఆమె కనువిందు చేయనుంది.సురేష్‌ గోపి, వాణీ విశ్వనాథ్‌ ప్రధాన పాత్రధారులుగా బాబురాజ్‌ దర్శకత్వంలో మలయాళంలో రూపొంది విజయం సాధించిన ఒక చిత్రం 'అంతిమ తీర్పు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని భార్గవ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రామ్‌సాగర్‌ ఆశీష్‌ సమర్పణలో మహేంద్ర కార్తీక్‌ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ, 'ఇటీవల సూపర్‌గుడ్‌ థియేటర్‌లో పాటల రికార్డింగ్‌ ప్రారంభమైంది. గురుచరణ్‌ చక్కని సాహిత్యాన్ని అందించారు.

జీవితాన్ని సరదాగా గడిపే కాలేజీ అమ్మాయిలు అనుకోని కారణాల వల్ల హత్యానేరంలో ఇరుక్కుంటారు. దాని నుంచి బయట పడటానికి చేసే ప్రయత్నంలో వారిలో కొందరు అమ్మాయిలు అంతమవుతారు. ర్యాగింగ్‌ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం చివరి నిమిషం వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది. ఇందులోని అన్ని పాటలూ హిట్‌ అయ్యాయి. తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది. సురేష్‌ గోపీ, వాణీ విశ్వనాథ్‌ పాత్రలు హైలైట్‌ అవుతాయి. ఎనిమిది మంది మోడల్స్‌ ప్రదరించిన నటన ప్రశంసనీయంగా ఉంటుంది' అన్నారు.సుజనా నాయుడు, శశికుమార్‌, దేవన్‌, విజయ రాఘవన్‌ నటించిన ఈ చిత్రానికి రచన: సాయిహర్ష, పాటలు: గురుచరణ్‌, కెమెరా: సుకుమార్‌, సంగీతం: రషీద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: నాగేంద్ర సింగ్‌ బాబు, నిర్మాత: మహేంద్ర కార్తీక్‌, దర్శకత్వం: బాబురాజ్‌.



»Home »IPL  »News  »Entertainment  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope  »Currency 

© Greynium Information Technologies Pvt. Ltd.