Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
బాలకృష్ణ నెక్ట్స్ టార్గెట్ హన్సికానా?
బుదవారం, నవంబర్ 4, 2009, 18:47 [IST]



Balakrishna
బాలకృష్ణ నెక్ట్స్ టార్గెట్ హన్సికానా? ఏ విషయంలో..అని అనుకుంటున్నారా? మరేదో సమాచారం అయితే ఇక్కడ ఎందుకు చర్చిస్తాం చెప్పండి? హీరోయిన్ గా బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ‘సింహా’ లో ముగ్గురి కథానాయికలలో ఎంపిక కావాల్సిన ఒక కథానాయికగా హన్సికను టార్గెట్ చేయనున్నట్టు సినీగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నాయికలుగా స్నేహ ఉల్లాల్, నమితలు నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ హన్సిక గనుక అయితే అది ఓ స్పెషల్ న్యూసే అవుతుంది. ఎలాగంటారా? యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ తో, హరేరామ్ లో కళ్యాణ్ రామ్ తో, మిత్రుడు సినిమాలో బాలకృష్ణతో కనువిందుగా నటించి ఓ అరుదైన రికార్డును ప్రియమణి ఆరోహణ క్రమంలో సాధించింది. అదే విధంగా కంత్రి లో జూ ఎన్టీఆర్ తో, జయీభవ లో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించి తన అందచందాలతో మెరిసిన కాశ్మీర్ ఆపిల్ హన్సిక సంక్రాంతికి విడుదల కానున్న ‘సింహా’ సినిమాలో బాలకృష్ణతో కడితే ప్రియమణి శ్రేణిలో తనూ వెళ్ళినట్టే.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.