Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
శ్రీరామదాసు నిర్మాత...ట్రాఫిక్ జామ్ లో
శుక్రవారం, నవంబర్ 6, 2009, 9:16 [IST]



Singeetham srinivas
నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో శ్రీరామదాసు చిత్రాన్ని నిర్మించిన కొండా కృష్ణంరాజు తాజాగా ట్రాఫిక్ జామ్ అనే చిత్రాన్ని రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆదిత్యా 369,భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు, ఘటోత్కచ, పుష్పక విమానం, రీసెంట్ గా త్యాగయ్య(చారిత్రికం)వంటి విభిన్న చిత్రాలు వరసగా చేస్తూ పోతున్న సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకుడు. సిటీల్లో రోజు రోజుకీ పెరిగి పోతున్న ట్రాఫిక్ జామ్ నేఫద్యంలో జరిగే కథగా ట్రాఫిక్ జామ్ ని రూపొందించనున్నారు. ఆదిత్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని కొండా కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ సంధర్భంగా దర్శక, నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.

దర్శకుడు మాట్లాడుతూ ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చేశాను. 'ట్రాఫిక్‌ జామ్‌' నేను ఇష్టపడి రాసుకున్న కథ. తప్పకుండా ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ..మా సంస్థ నుంచి శ్రీరామదాసు తరవాత వస్తున్న చిత్రమిది. జె.కె.భారవి సంభాషణలు సమకూరుస్తున్నారని అన్నారు.ఇక ప్రస్తుతం సింగీతం..త్యాగయ్య చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ ట్రాఫిక్ జామ్ చిత్రంలో హీరోగా అల్లరి నరేష్ కనిపించే అవకాశం ఉంది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.