Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
బెండు అప్పారావు తప్పించుకున్నాడు
మంగళవారం, అక్టోబర్ 27, 2009, 13:43 [IST]



Bendu Apparao
అల్లరి నరేష్ హీరోగా ఇవివి తీర్చి దిద్దిన బెండు అప్పారావు చిత్రం ఒకటే భాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించుకుంటూ కలెక్షన్స్ స్టడీగా నిలబెట్టుకుంది. సూర్య హీరోగా వచ్చిన ఘటికుడు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. అప్పటికీ నయనతార అందాలు, వడివేలు కామిడి కలసివచ్చినా కథ మైనస్ గా మహా నసగా మారటంతో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం రిలీజైన జయీభవ, బంపర్ ఆఫర్ రెండు చిత్రాలు కలెక్షన్స్ లేక చల్లబడ్డాయి. బంపర్ ఆఫర్ దర్శకుడు బాగానే తీసాడంటున్నా ప్రమేషన్ ప్లాబ్లమో మరేమో జనాల్ని ధియోటర్స్ కు లాగలేకపోతోంది. జయీభవ కి అయితే కళ్యాణరామ్ సినిమా నీరస పరిస్దితి ని అర్దం చేసుకుని కొత్త స్కీమ్ లతో ముందుకు వచ్చాడు. మరో ప్రక్క మగధీర చిత్రం వంద రోజులకు పరుగెడుతోంది. ముందు నుంచి అనుకుంటునట్లు గానే మహాత్మ చిత్రం మొదటి రెండు రోజులు దాటి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. అప్పటికి వివాదాలతో పబ్లిసిటీ జరిగినా మౌత్ టాక్ స్పెడ్ అవటంతో అటు వైపుకు తొంగి చూసే వారు కరువయ్యారు. దాంతో ఎంతో హడావిడిగా వందవ సినిమా అంటూ హంగామా చేసినా బిలో యావరేజి అనే ముద్ర వేయించుకుంది. వీటిన్నటికన్నా బెండు అప్పారావు డైలాగులే జనాలకి నచ్చుతున్నాయి. అందుకే వారాంతరాలైనా ధియోటర్స్ నిండుతున్నాయి.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.