శనివారం, మే 9, 2009, 15:55 [IST]
హైదరాబాద్: రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపి నేత శరద్ పవార్ కు లేఖ రాయనున్నారు. ఫలితాలపై ఈ నెల 16వ తేదీ సాయంత్రం సమావేశమై సమీక్షిస్తామని ఆ పార్టీ నాయకుడు టి.దేవేందర్ గౌడ్ చెప్పారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోస్తాలో కన్నా తెలంగాణలో తమ పార్టీకి కాస్తా తక్కువ సీట్లు రావచ్చునని ఆయన చెప్పారు. కేంద్ర వ్యవహారాలపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి సారథ్యంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలకమిటీ సమావేశం శనివారం జరిగింది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, పరిశీలకులతో ఇటీవల జరిపిన సమీక్ష సమావేశాల వివరాలను కమిటీ నేతలకు చిరంజీవి వివరించారు. రాష్ట్రం మొత్తం మీద ఎన్ని స్థానాలు గెలుస్తామనే అంశంతో పాటు ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించారు.