Oneindia Mobile
Photo Gallery!
అల్లాడి అలక: కొత్త చిక్కుల్లో చంద్రబాబు
గురువారం, అక్టోబర్ 29, 2009, 15:33 [IST]



Chandrababu Naidu
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. తాజాగా సికింద్రాబాద్ కు చెందిన సీనియర్ పార్టీ నాయకుడు అల్లాడి పి రాజ్ కుమార్ చంద్రబాబు నాయుడిపై అలక వహించినట్లు సమాచారం. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లేదని ఆరోపిస్తూ ఆయన అలక వహించినట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చంద్రబాబుకు చిక్కులు తప్పేట్లు లేవు. కాగా, మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా మళ్లీ అలక వహించారు. తనకు పోలిట్ బ్యూరో స్థానం కల్పించకపోవడంపై ఆయన అలక వహించినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై నిర్వహించిన సమావేశానికి కూడా ఆయన రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

కాగా, గ్రేటర్ హైదరాబాదులోని వంద డివిజన్లకు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 1వ తేదీన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. గ్రేటర్ ఎన్నికల్లో విజయానికి ఆయన గురువారం పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కె. రోశయ్య హైదరాబాదులో వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్ లో అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అది తమ హయాంలోనే జరిగిందని, కాంగ్రెసు ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆయన అన్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.