Oneindia Mobile
Todays Top Searches- Get here NOW!
అణగదొక్కే కొద్దీ జగన్ లేస్తారు: రఘువీరా
సోమవారం, నవంబర్ 2, 2009, 19:08 [IST]



RAghuveera Reddy
హైదరాబాద్: ఎంతగా అణగదొక్కాలని చూస్తే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అంతగా ఎదుగుతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. చర్యకు ప్రతిచర్య తప్పదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసుకు ప్రజారాజ్యంతో పొత్తు అవసరం లేదని ఆయన అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకండా ఒంటరిగా పోటీ చేసినా కాంగ్రెసు మరో రెండు పర్యాయాలు గెలువగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యంతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనమైతే బాగుంటుందని అన్నారు. ఎంతగా తొక్కితే అంతగా లేస్తారని ఎవరైనా గుర్తించాలని ఆయన అన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసుకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని, మొత్తం 150 డివిజన్లను గెలుచుకునే సత్తా కాంగ్రెసుకు ఉందని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి లేనందువల్ల కాంగ్రెసును గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజారాజ్యంతో పొత్తు కాంగ్రెసుకు నష్టమని ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేస్తామని ఆయన అన్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.