Oneindia Mobile
Video Premieres seen on ur Mozilla- Gr8!
డిఎస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు: మారెప్ప
మంగళవారం, నవంబర్ 3, 2009, 12:30 [IST]



Mareppa
కర్నూలు: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు మారెప్ప తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీని శ్రీనివాస్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ పదవి నుంచి డి. శ్రీనివాస్ ను తొలగించాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు పార్టీ టికెట్లు రాకుండా డి. శ్రీనివాస్ అమ్ముకున్నారని, ఆ ఘనత శ్రీనివాస్ దేనని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తు అంటూ పార్టీ ప్రతిష్టను శ్రీనివాస్ బజారుకీడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. డి.శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.