Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
పితృవాదం కేసులో ఎన్డీ తివారీకి ఊరట
మంగళవారం, నవంబర్ 3, 2009, 12:34 [IST]



ND Tiwari
న్యూఢిల్లీ: పితృవాదం కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్డీ తివారీకి ఊరట లభించింది. తాను తివారీకే పుట్టానంటూ తనను తివారీ కొడుకుగా గుర్తించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రి షేర్ సింగ్ మనవడు రోహిత్ శేఖర్ అనే యువకుడు వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారంనాడు కొట్టేసింది. కేసుకు సంబంధించి సరైనా ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది.

కేసు ఢిల్లీ పరిధిలోకి రాదంటూ తివారీ చేసిన ప్రతిపాదనను కూడా కోర్టు అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే తివారీకి కొంత ఊరట లభించింది. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు గతంలో మినహాయింపు లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ లో సవాల్ చేస్తామని రోహిత్ శేఖర్ తల్లి ఉజ్జ్వల శర్మ మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆమె చెప్పారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.