Oneindia Mobile
Todays Top Searches- Get here NOW!
మీడియా అతి చరుగ్గా ఉండొద్దు: రోశయ్య
మంగళవారం, నవంబర్ 3, 2009, 15:06 [IST]



Rosaiah
హైదరాబాద్: మీడియా చురుగ్గా ఉండాలని, అయితే అతి చురుకుదనం పనికి రాదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. విషయంలో వార్త వేరు, వార్తావ్యాఖ్య వేరని, మీడియాలో పోటీ వల్ల వార్తకు, వ్యాఖ్యానానికి మధ్య తేడా లేకుండా పోయిందని ఆయన అన్నారు. హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో గల ఆర్టీసి కళాభవన్ లో మంగళవారం జరిగిన ఎపి వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో మాదిరిగానే జర్నలిజంలోనూ మార్పులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి వారు పని చేస్తున్న యాజమాన్యాలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావాలని ఆయన సూచించారు. ఎపి వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య కార్యాలయం విషయాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.