Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
మంత్రి సుభాష్ చంద్ర బోస్ పై మావోయిస్టుల గురి
బుదవారం, నవంబర్ 4, 2009, 10:25 [IST]



Pilli Subhash Chandra Bose
రాజమండ్రి: సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ కు మావోయిస్టులు హెచ్చరిక లేఖ పంపారు. బీసీ వర్గానికి చెందిన తనపై మావోయిస్టుల కన్ను పడదని ఇంతకాలం అనుకున్న మంత్రికి దీనితో ముచ్చెమటలు పోస్తున్నాయి. ఆయనపై దాడి చేసేందుకు ముందస్తు సన్నాహంగా గత ఆదివారం రామచంద్రపురంలో రెక్కీ నిర్వహించినట్టు మావోయిస్టులు ఒక లేఖలో తెలిపారు. చత్తీస్‌గఢ్‌లోని ఒక కుంట దగ్గర వదిలిన లేఖ ప్రతులను మారేడుమిల్లిలో కొందరు మావోయిస్టు సానుభూతిపరులు మీడియా ప్రతినిధులకు అందజేశారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ లేఖలోని సారాంశం ఇది. మంత్రి పిల్లి సుభాచంద్రబోస్‌ పేద, దళిత, గిరిజన వర్గాలకు కంటగింపుగా మారారని, ఇందుకు సంబంధించి తమ దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో అధికారులు అవినీతికి పాల్పడుతుంటే వారికి కొమ్ముకాస్తున్నారని, ఆ లేఖల్లో ఆరోపించినట్టు సమాచారం. ఈ అభియోగాలపై త్వరలోనే మంత్రిని బోస్‌ను ప్రజాకోర్టులో నిలబెట్టి శిక్షిస్తామని హెచ్చరించారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.