Oneindia Mobile
Todays Top Searches- Get here NOW!
నేషనల్ డిఫెన్స్ కాలేజీపై దాడికి కుట్ర
బుదవారం, నవంబర్ 4, 2009, 10:31 [IST]



AK 47
వాషింగ్టన్: భారత దేశంలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీపై, డేనిష్ వార్తా పత్రికపై దాడులు చేయడానికి లష్కరే తోయిబా కుట్ర చేసినట్లు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బిఐ) వెల్లడించింది. గత నెల తాము అరెస్టు చేసిన డేవిడ్ కొలేమాన్ హెడ్లీ, తహవ్వూర్ హుస్సేన్ రాణాలను విచారించినప్పుడు ఆ విషయం బయట పడినట్లు తెలిపింది. రాణా బెయిల్ పిటిషన్ ను చికాగో కోర్టులో వ్యతిరేకిస్తూ ఎఫ్ బిఐ ఈ విషయం చెప్పింది.

పాకిస్తాన్ పుట్టిన కెనడియన్ పౌరుడు అయిన రాణా చికాగోలో ఉంటున్నాడు. అమెరికా పౌరుడు అయిన అతని మిత్రుడు హెడ్లీతో పాటు రాణాను ఎఫ్ బిఐ గత నెల అరెస్టు చేసింది. డెన్మార్క్, భారత్ ల్లో వారిద్దరు దాడులకు కుట్ర చేసినట్లు ఎఫ్ బిఐ వాదిస్తోంది. హెడ్లీ బెయిల్ పిటిషన్ పై విచారణ డిసెంబర్ కు వాయిదా పడింది. సెప్టెంబర్ 7వ తేదీన మిత్రులిద్దరి మధ్య జరిగిన చర్చలను బట్టి భారత్ లోని నేషనల్ డిఫెన్స్ కళాశాలపై దాడికి కుట్ర చేసినట్లు బయటపడిందని, దానితో పాటు ఇతర లక్ష్యాలపై కూడా వారిద్దరి మధ్య సంభాషణ జరిగిందని ఎఫ్ బిఐ కోర్టుకు తెలిపింది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.