Oneindia Mobile
Photo Gallery!
జగన్ కు క్షమాపణలు చెప్పా: సురేఖ
బుదవారం, నవంబర్ 4, 2009, 18:09 [IST]



Konda Surekha
హైదరాబాద్: మంత్రి పదవికి రాజీనామా చేసినందుకు తాను వైయస్ జగన్ కు క్షమాపణలు చెప్పినట్లు కాంగ్రెసు నాయకురాలు కొండా సురేఖ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన పావురాలగుట్ట స్థలాన్ని సందర్శించి వచ్చిన ఆమె తన భర్త కొండా మురళితో కలిసి ఆమె బుధవారం వైయస్ జగన్ ను, వైయస్ రాజశేఖర రెడ్డి భార్య విజయలక్ష్మిని కలుసుకున్నారు. ఆ తర్వాత సురేఖ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను రాజీనామా చేసినందుకు జగన్ ఆవేదన వ్యక్తం చేశారని, అంత త్యాగం అవసరం లేదని జగన్ అన్నట్లు ఆమె చెప్పారు.

ప్రజలు మన వెంట ఉన్నారని, అందువల్ల భవిష్యత్తు మనదేనని జగన్ తనతో అన్నారని ఆమె చెప్పారు. అయితే మనసు చంపుకుని మంత్రి వర్గంలో ఉండలేక తాను రాజీనామా చేశానని ఆమె అన్నారు. మంత్రులు మోపిదేవి, విశ్వరూప్, ఆనం రామనారాయణ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యురాలు జయసుధ కూడా జగన్ ను కలిశారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.