Oneindia Mobile
Photo Gallery!
అమరావతి మృతిపై అనుమానాలు
బుదవారం, నవంబర్ 4, 2009, 18:19 [IST]



Amaravathi
హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్పీ స్టేడియం స్పోర్ట్స్ హాస్టల్లో మహిళా బాక్సర్ అమరావతి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం అమరావతికి లేదని ఆమె సోదరుడు అంటున్నాడు. మంగళవారం రాత్రి బిర్యానీ తెప్పించుకుని తిన్నట్లు, ఆ బిర్యానీలోనే విషం కలుపుకుని అమరావతి తిని ఉంటుందని చెబుతున్నారు. జాతీయ క్రీడాకారిణి అయిన అమరావతి ఆర్థికపరమైన ఇబ్బందులు గానీ కుటుంబ సమస్యలు గానీ లేవని అంటున్నారు.

అమరావతిని కోచ్ నిరంతరం వేధించేవాడని, ఆమె తమకు చెప్పిందని ఆమె సోదరుడు అంటున్నాడు. టైటిల్ సాధించకపోతే చనిపోవాలంటూ అతను అనేవాడని తనకు చెప్పినట్లు అతను చెప్పాడు. తాను బాగా ఆడుతున్నా కూడా అతను వేధించాడని అమరావతి చెప్పినట్లు అతనన్నాడు. ఓంకార్ వేధింపులవల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంటున్నారు.

అమరావతి శవం పడకపై పడి ఉంది. నోటి నుంచి నురగలు కూడా వచ్చినట్లు ఆనవాళ్లున్నాయి. క్రీడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించారు. అమరావతిపై ఆయన విచారణకు ఆదేశించారు. పోస్టుమార్టం జరిగితే గాని విషయాలు తెలియవని స్పోర్ట్స్ అథారిటీ అధికారులంటున్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.