Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
ఢిల్లీలో తన గోడు వెళ్ళబోసుకోనున్న దానం
శనివారం, నవంబర్ 7, 2009, 11:57 [IST]



Danam Nagendar
హైదరాబాద్‌: రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి దానం నాగేందర్‌ ఈ రోజు మధ్యాహ్నాం ఢిల్లీ వెళ్లనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అధిష్ఠానానికి వివరణ ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నిన్న ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఎన్నికల విషయంపై కూడా కాంగ్రెస్ ప్రముఖులతో చర్చించనున్నారు.

నిన్న రాజీనామా చేసిన అనంతరం దానం ఇలా వ్యాఖ్యానించారు. "పార్టీ టికెట్లకు సంబంధించి జరిగిన ఆందోళన వెనుక పెద్ద శక్తుల హస్తం ఉంది. పేర్లు అవసరమైనపుడు వెల్లడిస్తా. పావులుగా వాడుకోవాలని కొందరు చూశారు. మేం పావులం కాదు" అని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ ఇంటి ముందు కొందరు కావాలనే ఆందోళన చేస్తున్నారా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. శుక్రవారం రాత్రి తన నివాసం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. తనకు పదవులు ముఖ్యం కాదని, తిరిగి గ్రేటర్‌ అధ్యక్ష పదవి ఇచ్చినా తీసుకోనని స్పష్టం చేశారు. గ్రేటర్‌ పరిధిలో పార్టీ విజయానికి సైనికుడిలా పనిచేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ఆశయం (100సీట్లు) నెరవేరడానికి కృషి చేస్తానన్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.