Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
వరదలపై చిదంబరానికి రోశయ్య నివేదిక
శనివారం, నవంబర్ 7, 2009, 12:04 [IST]



Chidambaram
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం ఉదయం కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశం అయ్యారు. అనంతరం రోశయ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని వరద పరిస్థితిపై ఓ నివేదినకు హోంమంత్రి చిదంబరానికి అందచేసినట్లు తెలిపారు. హోంమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు.

నిన్న ఢిల్లీ వచ్చిన వెంటనే రోశయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మూడు రాష్ట్రాల ఎన్నికల హడావిడి, రాష్ట్రంలో వరదల పరిస్థితి వల్లనే తాను ఇన్ని రోజులు ఢిల్లీ రాకపోయానని చెప్పారు. కేంద్రం నుంచి వరద సహాయ చర్యలకు అత్యధిక నిధులు రాబట్టడమే తన పర్యటన ప్రధాన ఉద్దేశమని అన్నారు. పార్టీ అధ్యక్షురాలు ఇచ్చే సమయాన్ని బట్టి సీఎల్పీ సమావేశం, ఇతర రాజకీయ అంశాలపై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రోశయ్య విమానాశ్రయంలో విలేఖరులతో కొద్ది సేపు మాట్లాడారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.