శనివారం, నవంబర్ 7, 2009, 12:34 [IST]
నెల్లూరు: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత అయిదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా కైవల్య నది పొంగి పోర్లుతోంది. జిల్లాలో రెండు హాస్టల్ భవనాలు వానల కారణంగా నేలకూలాయి.
కావలి డీవిజన్ లో వానల వల్ల ఎక్కువ నష్టం జరిగింది. పిల్లివాగు, చిప్పలేరు వాగు పొంగటంతో కావలి డివిజన్‌లోని నాలుగు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్లు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అల్లూరు-కావలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నెల్లూరు తీరంలో సముద్రం అల్లకల్లోలం గా తయారైంది. అలల ఎగసి పడుతున్నాయి. మత్య్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తమిళనాడులో భారీ వర్షాల కారణంగా సూళ్లురుపేట, చెన్నె సరీస్సులను ఆర్టీసీ నిలిపివేసింది.