Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
సోనియా గాంధీకి నిక్కచ్చిగా చెప్పిన రోశయ్య
శనివారం, నవంబర్ 7, 2009, 12:38 [IST]



Sonia Gandhi
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్ధితులను ఆమెకు నిక్కచ్చిగా వివరించారు. రెండు నెలల తర్వాత ఢిల్లీకి వచ్చిన సీఎం రోశయ్యకు ఇది అత్యంత కీలక సమావేశంగానే చెప్పవచ్చు. ప్రధానంగా సిఎల్పీ సమావేశం, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ, తాజాగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తదితర వాటిపై చర్చలు జరిగినట్టు సమాచారం. జగన్ వ్యవహారంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడిగా రోశయ్య జగన్ గురించి ఎటువంటి నెగిటివ్ విషయాలు సోనియాకు చెప్పలేదని తెలుస్తోంది. నేటి సాయంత్రం జగన్ తన కుటుంబ సభ్యులతో సోనియా గాంధీని కలుసుకోనున్నారు.

అంతకు ముందు రోశయ్య కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని కరువు నిధులు ఇవ్వాలని కోరినట్లు, అలాగే మిగిలిన 500 కోట్ల రూపాయల కరువు నిధిని విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సోనియాగాంధీ అధ్యక్షతన కోర్‌ కమిటీ జరుగుతుందని చిదంబరం చెప్పినట్లు రోశయ్యపేర్కొన్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.