Oneindia Mobile
Photo Gallery!
మాజీ నక్సల్ రవీందర్ రెడ్డి దారుణ హత్య
శనివారం, నవంబర్ 7, 2009, 14:01 [IST]



Naxalite
హైదరాబాద్‌: నగరంలో నివసిస్తున్న ఓ మాజీ నక్సల్‌ దారుణహత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌ దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సూరారంలో నివశిస్తున్న మాజీ నక్సలైట్‌ రవీందర్‌రెడ్డి ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో ఒక నకిలీ నక్సలైట్ ముఠా వివరాలివి: మెదక్‌ జిల్లా రామచంద్రాపురంలో నకిలీ నక్సలైట్ల ముఠాను పోలీసులుఅరెస్టు చేశారు. నక్సలైట్లమని చెప్పి వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాను బుధవారంఅరెస్టు చేసినట్లు జిల్లా ఎస్‌.పి. చెప్పారు.

నిషిద్ధపీపుల్స్‌వార్‌ గ్రూప్‌ లెటర్‌ హెడ్స్‌ను సృష్టించి, డబ్బులు డిమాండ్‌ చేస్తూ లేఖలు రాస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నకిలీ నక్సలైట్ల ముఠా నుంచి అత్యాధునికమైన 38 చైనా రివాల్వర్లను, 18 వేల రూపాయల నగదును పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.