Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
చిరంజీవి వరద సహాయ సేకరణ 32 లక్షలు
శనివారం, నవంబర్ 7, 2009, 15:45 [IST]



Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అదినేత చిరంజీవి వరద బాధితుల కోసం విశాఖలో జోలె పట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి గతనెల విశాఖపట్నంలో జోలెపట్టి సేకరించిన విరాళాల మొత్తం 32 లక్షల 48 వేల 654 రూపాయలని ప్రజారాజ్యం నేతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు సైతం తమ కిడ్డీ బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చిచ్చారని చెప్తూ వరదబాధితులను ఆదుకోవడానికి విరాళాలు అందించినవారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబ్బును ఇవాళ సాయంత్రం జరిగే సినీ తారల స్టార్‌నైట్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి అందజేస్తామని చిరంజీవి చెప్పారు. మగధీర సినిమా ఒకరోజు కలెక్షన్లను కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్‌ అందజేయనున్నారని చెప్పారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.