బోన్ లెస్ చికెన్ - 1/2 kg కోడిగుడ్లు - 2 no కార్న్ ఫ్లోర్ - 2 tbsp మైదా - 2 tsp ఉప్పు - రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి - 2 tsp పచ్చిమిర్చి పేస్ట్ - 1 tsp సోయా సాస్ - 1/2 tsp కారం - 1 tsp మిరియాల పొడి - 1 tsp ఉల్లిపాయలు - 1 cup కొత్తిమిర - 1/4 cup నూనె - వేయించడానికి సరిపడా
1. చికెన్ శుభ్రంగా కడిగి నీళ్ళు లేకుండా వంపేసి తడి అరనివ్వాలి. 2. పైన శుభ్ర పరచి పెట్టుకొన్న చికెన్ లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, మైదా,కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు, కొత్తిమిర వేసి బాగా కలిపి వేడి నూనెలో వేసి పకోడీల్లా ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. 3. తర్వాత వెడల్పాటి పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక వేయించిన ముక్కలను అందోలో వేసి వేపాలి. 4. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, మిరియాలపొడి, సోయా సాస్ వేసి బాగా కలపాలి. 5. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసి అందులో కార్న్ ఫ్లోర్ వేసి బాగా ఉండలు కట్టకుండా కలపాలి తర్వాత వేగుతున్న చికెన్ లో వేసి బాగా ఉడికించాలి. 6 ఫైనల్ గా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి 10 నిమిషాలు ఉడికించి దింపేయాలి.