Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
పకోడా కర్రీ
బుదవారం, నవంబర్ 4, 2009, 9:51 [IST]



Pakoda Curry
కావలసిన పదార్థాలు:

శనగ పిండి - 1 cup
ఉల్లిపాయలు - 1/4 kg
అల్లం - కొద్దిగా
పసుపు- 1/2 tsp
కొత్తిమిర- 1/2 cup
ధనియాలు - 2tbsp
నూనె - తగినంత
వంటపోడా - చిటికెడు
కారం - 2 tbsp
ఉప్పు- రుచికి సరిపడా
పచ్చికొబ్బరి - 1/2 cup
జిలకర్ర - 1/2 tsp
పచ్చిమిర్చి - 4
ఆవాలు - 1 tsp
కరివేపాకు - 2 రెమ్మలు

తయారు చేయు విదానం:

1. ముందుగా ఒక కప్పు శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వంట సోడా, కారం, వేసి కొద్దిగా నీరు వేసి గట్టిగా కలుపుకోవాలి.
2. స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి అందులో పైన తయారు చేసిపెట్టుకొన్న మిశ్రమాన్ని పకోడిలా వేసుకొని దోరగా వేయించి వీటిని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఉల్లిపాయ ముక్కలు, టమాట, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి, జిలకర్ర వేసి మెత్తగా గ్రైడ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
4. స్టౌ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, ఉల్లిపాయలు, కొత్తిమిర వేసి కొంచం నీరు పోసి అందులో వేయించి పెట్టుకొన్న పకోడని అందులో వేసి పది నిమిషాలు వేయించాలి. అంతే పకోడ కర్రీ రెడీ దీన్ని కొత్తిమిరతో గార్నిష్ చేస్తే చూడగానే తినేయాలనిపిస్తుంది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.