Oneindia Mobile
Photo Gallery on ur Mozilla!
కాకినాడ కాజాలు
శనివారం, నవంబర్ 7, 2009, 16:08 [IST]



Kakinada Kajalu
కావలసిన పదార్ధాలు:

మైదా పిండి - 1/2 kg
ఉప్పు - రుచికిసరిపడ
నూనె - వేయించడానికి తగినంత
బెల్లం లేదా పంచదార - 1/2 kg
కారం - 2 tsp
యాలకలు - 2

తయారు చేయువిధానం:

1. ముందుగా మైదా పిండి తీసుకొని కొద్దిగా కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీనికి తగినన్ని నీరు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు చేసి పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి.ఆ చపాతీని ముందు నిలువుగా తరువాత అడ్డంగా చాకుతో కోసుకోవాలి డైమెండ్ ఆకారం లో ఇప్పుడు అలా కోసిన వాటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి.
3. కారం ను ఇష్టపడేవారు కమ్మటివి కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఆ కాజాల మీద చల్లుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు.
4. తియ్యటివి కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ముదురు పాకం పట్టి అందులోయాలకల పొడి వేసి వేయించిన కాజాలు వేసి బాగా కలుపుకోవాలి, పాకం అన్ని కాజాలకి పట్టేలాగా. చల్లారిన తరువాత ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.