బియ్యం : అర కిలో కారెట్ : 4 బీన్సు: 100grm బంగాళా దుంపలు లేదా ఆలూ: 4 ఉల్లిపాయలు : 6 పచ్చి బఠాణీ : 1 cup నానబెట్టినవి లవంగాలు: 5 యాలకులు : 5 దాల్చిన చెక్క : 5 అల్లం వెల్లుల్లి ముద్ద : 2 నూనె , నేయ్యి - తగినంత పచ్చిమిర్చి - 5 ధనియాలు - 2 tsp కారం - 1 పసుపు - చిటికెడు ఉప్పు - రుచికి సరిపడ నీరు - ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు నీరు కొత్తిమీర - ఒక కట్ట పుదినా - అర కట్ట బిర్యాని ఆకు : 2
తయారు చేయువిధానం: 1. ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి. 2. ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని స్టౌ మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి. 3. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెసి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి మద్యకు కట్ చేసి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు అన్ని వేసుకొని అవి కొంచెం బాగా వేగ నివ్వాలి. 4. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అందులో వేసి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు వేసి బాగా కలుపుకోవాలి. 5. ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూడు విజిల్ వచ్చాకా దింపుకోవాలి. అంతే వెజిటేబుల్ పలావ్ రెడీ. దీనికి పెరుగు పచ్చిడి మంచి కాంబినేషన్.