Oneindia Mobile
Todays Top Searches- Get here NOW!
శోభారాణి వివాహం?
గురువరం, ఆగస్ట్ 6, 2009, 15:32 [IST]



హైదరాబాద్: సుమారు మూడు నెలల క్రితం కావచ్చు ప్రజారాజ్యం మహిళా అధ్యక్షురాలు శోభారాణి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పత్రికల్లో వచ్చింది. భర్త తనను తాగివచ్చి వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు. స్వయంగా న్యాయవాది అయిన శోభారాణి తెలివైనవారు. పైగా మాటకారి. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రకాష్ రాజ్ తో ఆమెకు పెళ్ళి అయ్యిందన్న విషయం గత నెల రోజులుగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ లో వారిద్దరి ఫోటోలు ప్రత్యక్షం కావడంతో అందరూ ఆ విషయాన్ని నమ్మే పరిస్ధితి వచ్చింది. శోభారాణిని ఏమైనా అంటే ఆమె ఎస్ ఎసి, అట్రాసిటీస్ కేసు పెడతారన్న భయం మిగితాపార్టీల మహిళా నాయకులకు ఉంది. ఒక సందర్భంలో తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఒక టీవీ చానల్ చర్చా కార్యక్రమంలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ప్రజారాజ్యం పార్టీ వ్యవహారాల్లో అనేక సందర్భాల్లో శోభారాణి వివాదాస్పదమయ్యారు.అయినా శోభారాణిని ఆ పదవి నుంచి తొలగించే సాహసాన్ని ఆయన చేయలేకపోయారు. ఇంతకీ శోభారాణికి ఆయన భర్తకు విడాకులు మంజూరయ్యాయా? ఆ విషయాన్ని మీడియా ధృవీకరించలేకపోతోంది. ప్రకాష్ రాజ్ కు విడాకులు లభించాయి. ఆయన ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చు. శోభారాణి ఈ వ్యవహారంపై తన ఇంట్లోనే ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం అనేక అభిప్రాయాలకు ఆస్కారం కల్పిస్తోంది. మరో వైపు ఆమె భర్త తమకు విడాకులు మంజూరు కాలేదంటూ ఫీలర్లు పంపడం విశేషం.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.