Oneindia Mobile
చిరంజీవికి విలన్లు!
గురువరం, ఆగస్ట్ 20, 2009, 16:25 [IST]



Chiranjeevi
హైదరాబాద్: చిరు పార్టీలో పెను దుమారం రేగుతోంది. టీడీపీ నుంచి చేరిన సీనియర్లలో చాలామంది ఓడిపో యారు కాబట్టి, వారి సొంత బలమేమిటో తెలిసిపోయినం దున అలాంటి నేతలు మళ్లీ సొంతపార్టీకి వెళ్లినా పెద్దగా పట్టించుకోనవసరం లేనప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పార్టీకి ఓట్లు సాధించిన అభ్యర్ధులు ఎవరి దారి వారు చూసుకోవడం ప్రారంభించడమే చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా.. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో అధి కార పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్న వైనం ఆందోళనగా పరిణమించింది. ఇది పీఆర్పీ భవితవ్యానికి ప్రమాదంగా పరిణమించింది. శాసనసభకు 68,22,946 ఓట్లతో 16.22 శాతం, పార్లమెంటుకు 74,89,936 ఓట్ల తో 17.91 శాతం ఓట్లు సాధించిన పీఆర్పీ స్థాపించిన ఏడాదిలోనే పేకమేడలా కుప్పకూలిపోవడం అధ్యక్షుడు చిరంజీవికీ కలవరం కలిగిస్తోంది. గత ఎన్నికల్లో చిరంజీవి ఆకర్షణ, స్థానిక నేతల పట్టు కారణంగా పోలయిన 68 లక్షల ఓటు బ్యాంకు మళ్లీ నాలుగేళ్ల వరకూ నిలుస్తుందా? ఆ మేరకు నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టే నేతలెవరన్న అనుమానం తెరపైకి వస్తోంది. గత ఎన్నికల్లో పోటీచేసిన చాలామంది అభ్యర్ధులు ఇప్పటికే పార్టీని వీడారు. దానితో కొత్త ఓటు బ్యాంకు కొల్లగొట్టడం అటుంచి, ఉన్న ఓటు బ్యాంకు కాపాడుకోవడమెలాగన్నదే పీఆర్పీ నాయకత్వానికి ఆందోళనగా పరిణమించింది.

పక్కచూపులు

నెల్లూరు ఎమ్మెల్సీ బి.రాఘవేంద్రరెడ్డి కూడా పీఆర్పీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన స్వతహాగా పీఆర్పీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కానప్పటికీ, పార్టీ పెట్టిన తర్వాత అందులో చేరారు. నిజానికి రాఘవేంద్రరెడ్డి గత ఎన్నికల కు ముందు టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. ఇప్పు డాయన కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ స్థాపించిన రోజుల్లో చేరిన మరో ఎమ్మెల్యే గొర్లె హరిబాబు నాయుడు ఎన్నికల ముందే పీఆర్పీని వీడి, కాంగ్రెస్‌లో చేరారు. ఇక నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆయన చాలాకాలం నుంచి ఆనం బ్రదర్స్‌తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నా రు. పేరుకు ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయన నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లేకుండా ఏ అధికార కార్యక్రమం జరగదు. ఆనం వివేకా నందరెడ్డి, కృష్ణారెడ్డి ఇద్దరూ కలిసే కార్యక్రమాలకు వెళుతున్నారు. కృష్ణారెడ్డి పీఆర్పీ నుంచి గెలిచినప్పటికీ, మానసికంగా కాంగ్రెస్‌కు దగ్గర గానే ఉంటారని నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మె ల్యే ఈలి నాని కూడా స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో సన్ని హితంగానే ఉంటున్నారు. ఆయన మొదటినుంచీ కాంగ్రెస్‌ వాదేకావడం గమనార్హం.

పీఆర్పీ ఎమ్మెల్యేలలో మెజారిటీ శాతం కాంగ్రెస్‌ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వంగాగీత మినహా మిగిలిన వారిలో చాలా మంది ప్రభుత్వానికి, జిల్లా మంత్రులతో సన్నిహిత సంబం ధాలు నెరుపుతున్నారు. పార్టీ నాయకత్వం కూడా ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఉండకూడదన్న విధానంతో వ్యవహ రించటం వల్ల ఎమ్మెల్యేలు కూడా ఆ సూత్రాన్నే పాటిస్తు న్నట్లు కనిపిస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమం త్రితో సాన్నిహిత్యంగా ఉండేందుకు నియోజకవర్గ అభి వృద్ధి నిధుల పేరుతో ఆయనను తరచూ కలుస్తున్నారు.



»Home »IPL  »News  »Entertainment  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope  »Currency 

© Greynium Information Technologies Pvt. Ltd.