Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
రేసులో జైపాల్ రెడ్డి?
సోమవారం, నవంబర్ 2, 2009, 12:11 [IST]



Jaipal Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రేసులోకి జైపాల్ రెడ్డి వచ్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ మరణించిన వెంటనే ఆయనకు ఆ చాన్స్ వచ్చినా అప్పట్లో ఆయన వద్దనుకున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వెళ్ళమని సోనియా గాంధీ కోరినా ఆయన సున్నితంగా తిరస్కరించారు. వికలాంగుడైన తాను వైఎస్ లాగా వేగంగా ప్రజల మధ్య తిరగలేనని, వైఎస్ ను చూసిన కళ్ళతో జనం తనను చూడలేరని ఆయన సర్దిచెప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు పరిస్ధితులు మారిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆశించిన జైపాల్ రెడ్డికి నిరాశే మిగిలింది. రోశయ్య ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేని రెడ్డి కుల లాబీ ఇప్పుడు జైపాల్ రెడ్డిని తెరమీదికి తీసుకొస్తున్నట్టు తెలిసింది. కొందరు రెడ్డి కాంట్రాక్టర్లు ఢిల్లీలో మకాం వేసి జైపాల్ అభ్యర్ధిత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనార్ధన్ రెడ్డిని కూడా ఒప్పించినట్టు తెలిసింది. రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని, మరో రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మరో పదేళ్ళు పట్టవచ్చని రెడ్డి లాబీ ఆందోళన చెందుతోంది.

తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మినహా రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రుల్లో అత్యధిక సంఖ్యాకులు రెడ్లే. రెడ్లు అన్ని పార్టీల్లోనూ ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో ఎక్కువగా ఉన్నారు. జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెడ్డి కాంట్రాక్టర్లకు లాభసాటి కాంట్రాక్టులు లభిస్తాయి. ఆ వర్గానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా పంటపండినట్టే. ఆ వర్గానికి చెందిన ఉన్నతాధికారులకు కీలకమైన పదవులు లభిస్తాయి. జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే జగన్ కు ఆ పదవి ఇప్పట్లో దక్కే అవకాశముండదు. ఆ పరిస్ధితుల్లో కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవిని జగన్ వర్గం కోరే అవకాశముంది. జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్న జగన్ అందుకు ఒప్పుకోవడం లేదు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.